Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుథ్రిల్‌ చేసే యూనిక్ కాన్సెప్ట్‌

థ్రిల్‌ చేసే యూనిక్ కాన్సెప్ట్‌

- Advertisement -

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’.
రాగ్ మయూర్ హీరోగా చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది.
హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో హీరోగా వస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ‘డిజే టిల్లు’ పెద్ద హిట్ తర్వాత విమల్ కృష్ణ నాతో సినిమా చేయాలనుకున్నారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథ ఎక్కడా లేదు. ఇలాంటి కథపై ఎవరూ సినిమా చేయలేదు. ఈనెల 25న ఒక అద్భుత మైన సినిమా మీ ముందుకు రాబోతోంది’ అని అన్నారు. ‘ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 100% హిట్‌ కొడుతున్నాం. ‘డీజే టిల్లు’ మీకు ఎలా సర్‌ప్రైజ్ ఇచ్చిందో, ఈ సినిమా కూడా మిమ్మల్ని 100% సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని డైరెక్టర్ విమల్ కృష్ణ చెప్పారు. ప్రొడ్యూసర్ రాజీవ్ చిలక మాట్లాడుతూ, ‘ఇది స్టోరీ, కథనం, ప్రెజెంటేషన్‌లో డిఫరెంట్‌గా ఉండే సినిమా. చాలా యూనిక్ ఫిల్మ్’ అని తెలిపారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా మీ అందరి అభిమానంతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్ మేఘా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -