- Advertisement -
హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – ఏకే47’ విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -



