Homeతాజా వార్తలుభారీ వర్షాలు..విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

భారీ వర్షాలు..విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌కు మళ్లించారు. శంషాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్‌ ఎయిర్‌ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు.  వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే విమాన వివరాలు చెక్ చేసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -