Homeకరీంనగర్సీఎం సభను విజయవంతం చేయాలి

సీఎం సభను విజయవంతం చేయాలి

- Advertisement -

లక్ష మందితో భారీ బహిరంగ సభ
– రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – రుద్రంగి
సెప్టెంబర్ 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని, ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రుద్రంగి మండల కేంద్రంలో సన్నాహక సమావేశానికి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్‌లో ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సిరిసిల్లలో రేవంత్ రెడ్డి సభ ప్రకటనతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలైందని విప్ అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల చేనేత రంగానికి, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సభతో సిరిసిల్లలో రాజకీయంగా కొత్త చర్చ ప్రారంభమవుతుందని, కేటీఆర్ రాజకీయ పతనం సెప్టెంబర్ 30 నుంచి మొదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్, కేసీఆర్ రాజన్న సన్నిధికి వచ్చి గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సభకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేలా గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రామానికి ఎన్ని బస్సులు అవసరమో ముందుగానే తెలియజేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలను సమీకరించడంతో పాటు వివిధ సామాజిక, రాజకీయ వర్గాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకుల సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా గత 1,000 రోజుల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, భవిష్యత్‌లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కార్యాచరణను ప్రజలకు వివరించనున్నట్లు విప్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -