Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంతో టీబీ దరిచేరదు: డా.మీర్జా  

పౌష్టికాహారంతో టీబీ దరిచేరదు: డా.మీర్జా  

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
పౌష్టికాహారం తీసుకుంటే టీబి వ్యాధి దరిచేరదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మీర్జా చెప్పారు. గురువారం మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉచిత వైద్య క్యాంపు నిర్వహించారు. 90 మందికి  ఆరోగ్య సమస్యలతో జ్వరం, దగ్గు ,సర్ది కాళ్ల, నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వివిధ వ్యాధులకు సంబంధించిన షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. క్షయ వ్యాధి అనుమానితులను 27మందిని గుర్తించి స్ఫుటం, తేమడ శాంపిల్ తీసుకున్నారు. క్షయ నిర్ధారనైతే వారికి ఆరు నెలల పాటు ఉచిత మందులతో పాటు పౌష్టికాహారానికి నెలకు రూ.1000 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 

ప్రతి విధిగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజన్లో వచ్చే వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత ఆశా వర్కర్లపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ అనూష, హెల్త్ అసిస్టెంట్ దేవయ్య, ఏఎన్ఎం లు చంద్రకళ, తిరుపతమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్ రాజ్, ఆశా కార్యకర్తలు నాగమణి, రాజేశ్వరి, తిరుపతమ్మ, యాదమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -