Homeతాజా వార్తలు'జార్జ్.. క్రిష్'గా శర్వా ద్విపాత్రాభినయం

‘జార్జ్.. క్రిష్’గా శర్వా ద్విపాత్రాభినయం

- Advertisement -

హీరో శర్వా, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్‌ను విడుదల చేశారు. శ్రీను వైట్ల సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే హ్యూమర్, ఫన్ ఈ బూస్టర్‌లో పుష్కలంగా కనిపించింది. ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించనున్నారు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఈ రెండు పాత్రలను చూపిస్తూ క్యూరియాసిటీ పెంచారు. లీడ్ పెయిర్ మధ్య ఉండే కాంటెంపరరీ లవ్ ట్రాక్‌కి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా ఫస్ట్ బూస్టర్‌లో చూపించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -