సందీప్ కిషన్ నటించిన యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాని కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించారు. సిగ్మా నా ఫస్ట్ తమిళ్ సినిమా. లైకా లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యానర్లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మంచి యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ రేడియో జాకీ. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ప్రజెంట్ చేశాను. ఫ్యామిలీతో కలిసి మీరు సినిమా చూడొచ్చు. సందీప్, నా క్యారెక్టర్స్ లో చాలా కొత్తదనం వుంటుంది. జేసన్ చెప్పిన కథ విన్న తర్వాత చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. తనకు డైరెక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీ ఉన్న విజన్‌తో తీశారు. ట్రైలర్ ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి, ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉంది అని చెప్పారు.
తమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన సిగ్నేచర్ మీకు కనిపిస్తుంది. ఇందులో చివర్లో సిగ్మా స్టైల్ పాట ఉంది. ఆ పాటను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. పాటలు రీచ్ అవ్వడం నాకు అడ్వాంటేజ్‌గా అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు వాళ్లతో రెండో సినిమా. నాకు దర్శకత్వం పై ఆసక్తి ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను.
ఇలాంటి పాత్ర చేయలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



