Homeఆటలుఏ లెక్కన ఎంపిక చేశారు?

ఏ లెక్కన ఎంపిక చేశారు?

- Advertisement -

హెచ్‌‌సీఏ సెలక్షన్స్‌‌పై టీసీఏ సూటి ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌ : హెచ్‌‌సీఏ జట్ల ఎంపికలో తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉందని, అండర్‌-19 జట్టుకు ఎంపికైన క్రీడాకారుల కంటే జిల్లా క్రికెటర్లు మెరుగ్గా రాణించారని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి తెలిపారు. ‘శ్రీ సహస్ర రాజ్‌ , జాహ్నవి, తను శ్రీ, రుక్సార్‌, కోట సహస్ర, ప్రసన్న వంటి మహిళా క్రికెటర్లు నిలకడగా రాణించారు. అయినా, జట్టులో చోటు దక్కలేదు. ఈ సీజన్‌‌లో గణాంకాల పరంగా ఏమాత్రం ఆకట్టుకోని క్రికెటర్లను ఏ లెక్కన ఎంపిక చేశారని’ గురువారెడ్డి ప్రశ్నించారు. హెచ్‌‌సీఏ పరిధి జిల్లాలకు వర్తించదని, ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయాన్ని గురువారెడ్డి గుర్తు చేశారు. ఇటీవల బీసీసీఐ ఏజీఎంకు హాజరైనట్టు హెచ్‌‌సీఏ కార్యదర్శి జీవన్‌‌రెడ్డి వివరణ ఇచ్చారు. బీసీసీఐ ఏజీఎం ఓటర్ల జాబితాలో పేరు లేకుండా ఏ రూల్‌ ‌ప్రకారం జీవన్‌‌రెడ్డి ఏజీఎంకు హాజరయ్యారు. ప్రెసిడెంట్‌‌తో ఫోటో దిగితే ఏజీఎం హాజరైనట్టా? అని గురువారెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -