Homeతాజా వార్తలుటస్కర్‌పైకి ఖైరతాబాద్‌ బడా గణేశ్‌.. కాసేపట్లో శోభాయాత్ర

టస్కర్‌పైకి ఖైరతాబాద్‌ బడా గణేశ్‌.. కాసేపట్లో శోభాయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్ లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం నెలకొంది. ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. కాసేపట్లో ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే 69 అడుగుల బడా గణేశుడిని టస్కర్‌ వాహనంపైకి చేర్చారు. విగ్రహం చుట్టూ వెల్డింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటలలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. క్రేన్‌ నంబర్‌ 5 వద్ద ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనం నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -