- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐచీ-నగోయా ఆసియా గేమ్స్‌లో ఆరో రోజు భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. షూటర్లు సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో సురుచి, కమల్జీత్ జోడీ పసిడి పతకాన్ని ముద్దాడింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశ పతకాల సంఖ్య 19కి చేరింది. మరోవైపు, స్వర్ణం గెలిచిన సురుచి-కమల్జీత్ జోడీ, క్వాలిఫికేషన్ రౌండ్లో ఆసియా రికార్డును సమం చేయడం విశేషం.
- Advertisement -


