- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. బై బై గణేషా’ అంటూ లక్షలాది మంది భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన బడా గణేషుడి శోభాయాత్ర దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. లక్షలాది మంది భక్తుల సందడితో నగర వీధుల్లో సాగిన ఈ మహా ఊరేగింపు టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా సచివాలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌కు బడా గణేష్‌ను తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బాహుబలి క్రేన్ పాయింట్-4 వద్ద గణనాథుడిని క్రేన్ సహాయంతో నిమజ్జన ఘట్టం పూర్తయింది.
- Advertisement -



