- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఉచిత పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలని మండల పరిధిలోని పెద్ద షక్కర్గా గ్రామ సర్పంచ్ విశాలాక్షి అన్నారు. శుక్రవారం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధర్వంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో సర్పంచ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సయ్యద్ యూనుస్, డాక్టర్ వినీత్ కుమార్‌లు సంయుక్తంగా 24 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 12 పశువులకు సాధారణ చికిత్సలు, 25 దూడలకు నట్టల నివారణ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ కార్యదర్శి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, పశువులదారులు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



