నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరం కార్యక్రమానికి చౌటుప్పల్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గురువారం వెళ్లారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల ప్రచారం కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరానికి చౌటుప్పల్ బ్లాక్,మండల,పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనా రెడ్డి బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సుర్కంటి వెంకట్ రెడ్డి,పెద్దగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు