రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ –  కంటేశ్వర్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనం పై తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్ జెండాను శుక్రవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ..మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము ” సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందిందని  రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అసిస్టెంట్ సెక్రటరీ పోచయ్య , డా. కౌలయ్య  ,పి.ఆర్.ఓ బి.రామకృష్ణ ,  సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love