రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నామ్ దేవ్వాడ లోని సంఘ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు ,ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్మోహన్, సిర్పా హనుమాన్లు, అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రాజు, కోశాధికారి ఈవిల్ నారాయణ, బన్సీలాల్ రాధాకృష్ణ ,పూర్ణచంద్రరావు రాజేందర్ పాల్గొన్నారు.