మండలంలో పలువురికి ఉత్తమ అవార్డులు

 నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని పలువురి ఉత్తమ సేవలను గుర్తిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి శుక్రవారం ఉత్తమ  అవార్డులు అందజేశారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించటంతో రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ కు, గ్రామ ప్రజలకు ఉత్తమ సేవలందించిన రామారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ కు, శ్రీ కాలభైరవ స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు రామచంద్రం కు, జూనియర్ అసిస్టెంట్ సురేందర్ కు ఉత్తమ అవార్డులను అందజేశారు.
Spread the love