హైదరాబాద్ : దుబాయ్ లోని స్కై2.0 క్లబ్‌లో వాటాలను కొనుగోలు చేసినట్లు వికాస్ లైఫ్ కేర్ లిమిటెడ్ తెలిపింది. ఇందుకోసం 79 మిలియన్ల పెట్టుబడులు పెడుతోన్నట్లు పేర్కొంది. ఇందుకోసం బ్లూస్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జడ్-ఎల్‌ఎల్‌సిఒ ఒప్పందం చేసుకున్నట్లు వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తెలిపింది. దీంతో స్కై2.0లో 60 శాతం వాటాలు దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రక్రియ పూర్తి కానుందని తెలిపింది.