10కి ప్రత్యేక తరగతులు ఉన్నట్టా? లేనట్టా?

నవతెలంగాణ- రామారెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, ప్రయివేటుకు దీటుగా, ప్రతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉత్తమ ఫలితాలు రావాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి, రోజువారీగా ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంటే, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల బాలుర   లో శనివారం ప్రత్యేక తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు చదువులో నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలను కూడా ఉపాధ్యాయులు, సమయపాలన పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయంపై ఎంఈఓ యోసఫ్ ను వివరణ కోరగా సమయపాలన పాటించకపోవడం పై, ప్రత్యేక తరగతుల పట్ల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
Spread the love