
నవతెలంగాణ – తొగుట
గీత కార్మిక సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలం గాణ కల్లుగీత వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ గ్రామాలలో బెల్ట్ షాపులు అధికమవడంతో కల్లు గీత వృత్తి నిర్వీర్యమైందని పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గ్రామాలలో బెల్టు షాపుల ఏరివేతకై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నూతన సొసైటీలు టియే ఫ్టీ ల మంజూరు కై సర్కార్ కృతనిచయంతో ఉంద ని అన్నారు. ప్రతి 50 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన గీతా కార్మికులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అల్వాల కృష్ణా గౌడ్, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మ న్ కురుమ యాదగిరి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయి కుమార్, ఎంపిడిఓ శ్రీధర్ సీనియర్, అసిస్టెంట్ శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.