మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతికి మొండి చేయి

– ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు
నవతెలంగాణ – కంటేశ్వర్
పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసేలా కేంద్ర మద్యంతర బడ్జెట్ ఉంది. ఆదాయపు పన్ను రూ.10 లక్షల వరకు మినహాయింపు ఇస్తారని మధ్యతరగతి వర్గం ఆశించిందని, కానీ ఎలాంటి మార్పులు లేకుండా మొండి చేయి చూపింది. కేవలం రూ.25000/- స్టాండర్డ్ డిడక్షన్ లో పెంచి, స్లాబులలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఇదే సమయంలో ధనవంతులకు, కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు మాత్రం కార్పొరేట్ పన్నులో 30% నుండి 22 శాతానికి తగ్గించిందని, దీనిని బట్టి ఈ బడ్జెట్ ఎవరికోసం  ఉద్దేశించబడిందో  ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు.
Spread the love