నవతెలంగాణ – కూకట్ పల్లి
కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలు ఖండిస్తూ, బాల్క సుమన్ పై, మంగళవారం యూత్ కాంగ్రెస్ కూకట్ పల్లి ఇన్చార్జ్ జిట్ట సునీల్ యాదవ్ అధ్వర్యంలో, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ కృష్ణ మోహన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కలికోట బలరాజ్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ చీటకోరు కృష్ణ, రాహుల్, చూహన్, ఎన్జి ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి రామ్ చరణ్, బాలాజీ నగర్ డివిజన్ యూత్ అధ్యక్షుడు శ్రావణ్ దర్శి, రాంచరణ్ , యూత్ కాంగ్రెస్ నాయకులు బబ్లూ మీ సోను కుమార్, ప్రేమ కుమార్, రాజు, శివ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్, చారీ, తదితరులు పాల్గొన్నారు.