
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా, పంతంగి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ స్థానిక తహసిల్దార్ శివకోటి హరికృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎంపీటీసీ సభ్యురాలు బోయ ఇందిర సంజీవ మాట్లాడుతూ.. పంతంగి గ్రామాన్ని పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దూడల బిక్షంగౌడ్, నాయకులు బోయ రామచందర్, సహస్ర ఫౌండే ఫౌండేషన్ చైర్మన్ చినుకాని శివ ప్రసాద్ మాజీ ఉపసర్పంచ్ బోయ లింగస్వామి ,బోయ అంబేద్కర్, మాజీ సర్పంచ్ చిర్క సంజీవరెడ్డి ,జాజుల అంజయ్య, కడగంజి జనార్ధన్, కార్యదర్శి చింతల శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.