
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో ఎప్పటికప్పుడు సమస్య లేకుండా పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి జిల్లా బీసీ సంక్షేమ అధికారి సరోజ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి, రాములపల్లి గ్రామాలలో సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, నర్సరీని పరిశీలించారు. డంపింగ్ షేడ్, వాటర్ ట్యాంక్ లను సందర్శించారు. తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు కల్పన, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ స్పెషల్ అఫీసర్ పాల్గొన్నారు.