భవన నిర్మాణ కార్యక్రమానికి కురుమలు తరలి రావాలీ..

– కురుమ సంఘం మండల అధ్యక్షుడు ఖండుగొండ
నవతెలంగాణ – జుక్కల్
ఈనెల 18న  హైద్రాబాద్ లోని కోకాపేటలో ప్రారంభించనున్న  రాష్ట్ర కురుమ సంఘం భవనం ప్రారంభోత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుంచి కురుమలు భారీ సంఖ్యలో తరలి రావాలని కురుమ సంఘం మండల అధ్యక్షుడు ఖండుగొండ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, బండారు దత్తాత్రేయ రానున్నట్లు ఆయన తెలిపారు. కపరుమ  సంఘం బలోపేతానికి  కరుమలను గుర్తించి  రాష్ట్రముఖ్యమంత్రికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట నాయకులు మారుతిగొండ, పండరి, తదితరులు ఉన్నారు.
Spread the love