గత కొన్ని రోజుల క్రితం ఆర్మూర్ లో ప్రధాన రహదారి పై గుర్తు తెలియని ఓ అనాధ ఆనారోగ్యంతో ఉండగా, అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే వైద్యసేవల నిమ్మిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ గత వారం రోజుల క్రితం మరణించాడు. తనకి సంబంధించినవారు ఎవరు రాకపోవడంతో ఆ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గంగాధర్ కోరగా, మంగళవారం దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత కార్యవర్గం కాసుల సాయితేజ, మద్ది గంగాధర్, జయదేవ్, అలాగే ఆర్మూర్ పోలిస్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు.