బాధ్యతలు చేపట్టిన డీఆర్డీఏ పీ.డీ సాయాగౌడ్

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ) ప్రాజెక్టు డైరెక్టర్ గా డీ.సాయాగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీ.ఆర్.డీ.ఏ అధికారులు, సిబ్బంది పీ.డీకి  స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పీ.డీ గా కొనసాగిన చందర్ రాథోడ్ బదిలీ కాగా, ఆయన స్థానంలో సాయాగౌడ్ కు ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు పీ.డీ సాయాగౌడ్ బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.
Spread the love