నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రభుత్వ అనుమతి లేకుండా నిజామాబాద్ నగరంలో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ చూపిస్తూ అక్రమంగా అడ్మిషన్ చేస్తున్న ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బుధవారం డిఐఈఓ కి ఏఐఎఫ్బి, ఏఐఎస్డిఎస్, ఏఐఎస్బి నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కేవలం నిర్మాణ దశలో ఉన్న బిల్డింగును చూపిస్తూ ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యం కోచింగ్ సెంటర్ పేరు చెప్పుతూ అక్రమంగా జూనియర్ కళాశాల అడ్మిషన్లను ప్రారంభిస్తుందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలతో డీఐఈఓ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. కనీస సౌకర్యాలు లేకుండా నాసిరకమైన భవనాన్ని యుద్ధ ప్రతిపాదికన నిర్మిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆల్ఫోర్స్ యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తమాని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు యశ్వంత్, అంకుష్, ఏఐఎఫ్డిఎస్ నాయకులు గోపాల్, విలాస్ తదితరులు పాల్గొన్నారు.