
తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని గోకారంలో చోటు చేసుకుంది. బుధవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన ఏర్వ రామచంద్రయ్య భార్యసుశీలతో కలిసి 17 తేది శనివారం మేడారం జాతరకు వెళ్లి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తెరచి ఉండడంతో ఇంటిలోపలికి వెల్లి పరిశీలించగా బీరువాను పగలగొట్టి బీరువాలో ఉన్న 4తులాల బంగారు నగలు, 17 తులాల వెండి పట్టగొలుసులను అగంతకులు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్కాడ్, క్లూస్ టీం తో దొంగల ఆచూకి కోసం తనిఖీ నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.