
ఉపాధి హామీ పనులకు ముమ్మరంగా చేపట్టాలని మండల అభివృద్ధి అధికారి సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించాలని, పనులలో నిర్లక్ష్యం చేయవద్దని, పనుల వద్ద అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఏపీఓ రజిత, కార్యదర్శి లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.