Monday, June 9, 2025
E-PAPER
Homeసినిమాబాలయ్య బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు

బాలయ్య బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు

- Advertisement -

హీరో బాలకష్ణ పుట్టినరోజు (ఈనెల 10) నేపథ్యంలో ఆయన నటించ బోయే 111వ చిత్రాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.
భారీ బ్లాక్‌ బస్టర్‌ ‘వీరసింహరెడ్డి’ తర్వాత గోపీచంద్‌ మలినేని, బాలకృష్ణ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రమిది.
ప్రస్తుతం ‘పెద్ది’ వంటి పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకట సతీష్‌ కిలారు, వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మ్యాసీవ్‌ స్కేల్‌లో నిర్మించనున్నారు. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లతో అదరగొట్టే దర్శకుడు గోపీచంద్‌ మలినేని తొలిసారిగా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమా వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’కి మించి ఉంటుందని మేకర్స్‌ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
‘అఖండ 2’
ఫస్ట్‌లుక్‌, టీజర్‌ రిలీజ్‌

బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
తాజాగా మేకర్స్‌ డబుల్‌ అప్‌డేట్‌లతో సర్‌ప్రైజ్‌ చేశారు. ‘అఖండ 2’ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఈనెల 9న బాలకష్ణ బర్త్‌డేకి ఒక రోజు ముందు విడుదల కానున్నాయి. ఇవి బాలయ్య ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నాయి. సంయుక్త హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ స్కేల్‌లో రిలీజ్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -