పరకాల బిట్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే

నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని బిట్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సైన్స్ డే బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు వాటర్ ప్యూరిఫికేషన్, మోడల్ సిటీ, సోలార్ సిస్టం వివిధ రకాల ప్రయోగాలను నిర్వహించి సృజనాత్మకతను చాటుకున్నారు. కార్యక్రమంలో బిట్స్ ప్రిన్సిపాల్ జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love