– ఈ ఏడు తగ్గిన దిగుబడి. – యాబై కేజీ ల సంచి ఆరువందలు.
– ఆనందంలో రైతు.
నవతెలంగాణ – జుక్కల్
మండలంలో దోసకాయ పంటను అంతర పంటగా రైతుులు పండిస్తున్నారు. సాధారణంగా రబీ సీజన్ లో పంటసాగుకు అనుకూలం కావడంతో జొన్న పంట, లేక ఇతర పంటలతో కలిపి అంతర పంటగా పండించడం ఇనావాయితీ. పెద్ద జొన్న పంటలో అంతర పంటగా వివరిగా పండించే రైతులు గతేడాదీ దోసకాయ పంట దిగుబడి బాగా వచ్చింది, గతేడాదీ ధర అంతంత మాత్రమే రైతుకు అందింది. ప్రస్తుతం పంటసాగు తగ్గించిన రైతులు ఈ ఏడు పంట దిగుబడి తగ్గడంతో ధర అమాంతం పెర్గి పోవడంతో రైతులు దోసకాయ పంట ఎందుకు వేయకపోతిమి అనే భాద మిగిలింది. గతేడాది సంచి యాబై కిలోలు సుమారుగా మూడు నుండి నాలుగు వందలు పలికితే నేడు ధర రెట్టింపుతో సంచి ఆరువందల ధర పలుకుతోంది. రైతులు దోస పంటను పండించేందుకు సుముఖంగా లేక పోవడంతో పాటు సరియైన సమయానికి పంట కోత చేసి అమ్మితేనే మార్కేట్ లో నాణ్యత సైజును బట్టి ధరను నిర్ణయిస్తారు.
జీరో పెట్టుబడి : దోసకాయ పంట సాగుకు పాత కాలం నాటీ విత్తనాలే ప్రస్తుతం మండలంలో ఉపయేాగంలో ఉంది. రైతులు పూర్వీకుల విత్తనాలనే ఇష్ట పడుతారు. పెట్టుబడి విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. ఒక సారీ విత్తుకుని జాగ్రత్తగా కలుపు తీసీ వేసి సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఎటువంటి చీడపురుగుల బెడద ఉండదు.
జీరో పెట్టుబడి : దోసకాయ పంట సాగుకు పాత కాలం నాటీ విత్తనాలే ప్రస్తుతం మండలంలో ఉపయేాగంలో ఉంది. రైతులు పూర్వీకుల విత్తనాలనే ఇష్ట పడుతారు. పెట్టుబడి విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. ఒక సారీ విత్తుకుని జాగ్రత్తగా కలుపు తీసీ వేసి సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఎటువంటి చీడపురుగుల బెడద ఉండదు.
పలు రాష్ట్రాలకు సప్లయ్: ఇక్కడ పండించిన దోసకాయ ఆంద్ర, తమిళనాడు, తో పాటు కర్ణాటక లకు పంపించడం జర్గుతుంది. దూరం ఎక్కువైన అక్కడ ధర బాగా పలుకడంతో ఎక్కువగా దళారులు , వ్యాపారులు , రైతులు అక్కడికి తరలిస్తారు.
ఔషద లక్షణాలు ఉన్న దోసకాయ పంట: ఈ పంటకు బయటి నుండి ఎటువంటి ఎరువులు, రసాయనాలను వాడక పోవడం , నీరు లేకున్న పండుతుంది. కాబట్టి ఎటువంటి రసయానాలు వాడల్సిన అవసరం లేదు. చీడపురుగుల బెడద ఉండదు. ఎండకు తట్టుకుని పండుతుంది. దోస కాయలను కోసి గింజలను వేరు చేసి ఎండ పెడుతారు. నూనే తీసీ పలు ఔషదాల వాడకంలో ఉపయేాగిస్తారు . నీటీశాతం ఎక్కువగా ఉండటం వలన ఆకలి, దాహం పచ్చిదోసకాయ తింటే అంతాసర్దుకోపోతుంది. దోసకాయ గింజలతో చట్ని చేసి వేడి అన్నంతో నెయ్యి లేదా నూనే పోసుకుని తినేవారికి బలే రుచిగా ఉంటుంది.
హంగర్గ రైతు , శివరాం గొండ:- రెండేకరాలలో అంతర పంటగా దోసకాయ పండించాను. వాతావరణంలోని మార్పుల వలన దిగుబడి తగ్గింది. ఎకరాకు ముప్పై సంచులు దిగుబడి వచ్చేది ప్రస్తుతం పదిపన్నేండు సంచులు వచ్చింది. ధర ఎక్కువగా పలకడంతో కలిసి వచ్చింది.