
ప్రధానమంత్రి మత్స్య సంపద యువజన పథకంలో ఉమ్మడి హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల మచ్చ కారులు చేరి కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోని ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలపడాలని హుస్నాబాద్ మత్స్యకార ఉత్పద్దార్ల సంఘం చైర్మన్ పోన్నబోయిన శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి మండలంలోని మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు అసంఘంలోని సభ్యులందరికీ అవగాహన కల్పించి ప్రధానమంత్రి మత్స సంపద యోజన పథకంలో చేర్పించాలని కోరారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క మచ్చ కారుడు ఈ సంఘములో చేరవచ్చు అన్నారు. సభ్యతానికి సభ్యులు రూ.2200 చెల్లించాలన్నారు .ఉమ్మడి మండలంలో 500 మంది సభ్యులు 10 లక్షలు చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వ పథకంలో 20 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వ పథకంలో మనకు గ్రాంట్ జమ చేస్తుందన్నారు. అదేవిధంగా స్వయంగా కోటి రూపాయల వరకు చేపల ఉత్పత్తి కోసం మనం ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. మార్చి పదో తేదీలోపు ఎక్కువమంది సభ్యత్వం తీసుకునేటట్లు చూడాలన్నారు.