మాపైనే దాడి..మాపైనే కేసులు..

నవతెలంగాణ –  తాడ్వాయి
ప్రత్యర్థులు మా పైనే దాడి చేశారు, దాడి చేసి తల పగలగొట్టారు .తల పగిలిందని తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు మాపైనే కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలం లోని చిట్యాల గ్రామంలో గత పది రోజుల క్రితం చేనులోని ఒడ్డు విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గ్రామానికి చెందిన శంబల భూపతి పై ప్రత్యర్థులు దాడి చేసి బండ రాయితో తలపై గట్టిగా భాదారు. దీంతో భూపతికి తల పగిలింది.తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. భూపతి ,భూపతి మామ శివరాములకు దెబ్బలు తగిలాయి. ఈ విషయమై భూపతి శివరాములు తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి గ్రామానికి చెందిన శంబల మైపాల్, శంబల భాస్కర్, రాజయ్య ,రవీందర్ లు తమ పై దాడి చేసి గాయపరిచారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వెంకటేశ్వర్లు నలుగురిపై కేసు నమోదు చేశారు .అనంతరం దాడి జరిగిన ఎనిమిది రోజుల తర్వాత తిరిగి తమపై ఎస్సై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సై కేసు వద్దు మాట్లాడుకోమని వేధిస్తున్నారని తెలిపారు.ఈ విషయమై తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తే తమపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పై అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
Spread the love