Tuesday, June 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫేస్‌ మాస్క్‌లు ధరిస్తే అరెస్ట్‌ చేయండి

ఫేస్‌ మాస్క్‌లు ధరిస్తే అరెస్ట్‌ చేయండి

- Advertisement -

ట్రంప్‌ తాజా ఉత్తర్వులు
వాషింగ్టన్‌ :
లాస్‌ఏంజెల్స్‌లో నిరసనలపై ట్రంప్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఫేస్‌ మాస్క్‌లు ధరించిన నిరసనకారులను అరెస్ట్‌ చేయాలని ప్రభుత్వ ఏజెంట్లను ఆదివారం ఆదేశించింది. లాస్‌ఏంజెల్స్‌లో హింస, అశాంతిని అణచివేసిన నేషనల్‌ గార్డ్‌ ( రాష్ట్ర గవర్నర్లచే నియంత్రించే మిలటరీ)ని ట్రంప్‌ ప్రశంసించారు. మాస్క్‌లు ధరించిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయండి అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు.
ఇక నుంచి నిరసనల సమయంలో మాస్క్‌లు ధరించడానికి అనుమతి ఉండదు అని ట్రంప్‌ గతంలో అన్నారు. అయితే ఇటువంటి ఉత్తర్వులుజారీ చేసే అధికారం సమాఖ్య ప్రభుత్వానికి ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. సాధారణంగా భద్రతా దళాలు గుర్తించకుండా ఉండేందుకు, బాణాసంచా , పోలీసులు వినియోగించే పెప్పర్‌ స్ప్రె, టియర్‌గ్యాస్‌ వంటి వాటి నుండి వెలువడే పొగ నుంచి రక్షించుకునేందుకు నిరసనకారులు మాస్క్‌లు వినియోగిస్తుంటారు.
మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో ఆదివారం ట్రంప్‌ కాలిఫోర్నియా నేషనల్‌ గార్డ్‌ ట్రూప్స్‌ను మోహరించారు. అయితే కాలిఫోర్నియా దళాల మోహరింపు చట్టవిరుద్ధమని ఆ రాష్ట్ర డెమోక్రటిక్‌ గవర్నర్‌ న్యూసమ్‌ మండిపడ్డారు. నావికాదళాలను మోహరిస్తామన్న ట్రంప్‌ బెదిరింపులు లాస్‌ఏంజెల్స్‌లో పరిస్థితి తీవ్రతరం కావడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వలసదారులపై ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతుండటంతో లాస్‌ ఏంజెల్స్‌లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం డౌన్‌టౌన్‌ వీధిలో అల్ఫాబెట్‌కి చెందిన వెమో కార్లను తగులబెట్టిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -