Monday, August 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

- Advertisement -

రంగంలోకి భారత్‌, చైనా రెస్క్యూ బృందాలు
788కి పెరిగిన మృతుల సంఖ్య
ఇప్పటి వరకు 2502 మంది గల్లంతు

ఖాట్మండ్‌ : నేపాల్‌లో జల ప్రళయం సృష్టించిన ముప్పునకు మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 788కు చేరిందని నేపాల్‌ పోలీసులు తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం.. చిత్వాన్‌ జిల్లాలో అత్యధికంగా 264 మంది మరణించారు. ఆ తర్వాత నవల్పరాసి ఈస్ట్‌బిలో 194, నవల్పరాసి వెస్ట్‌బిలో 120, గూర్ఖాలో 58, నువాకోట్‌బిలో 52, ధాడింగ్‌బిలో 50, తున హున్‌బిలో 37, రుసువాలో 13 మంది ప్రాణాలు కోల్పో యారు. కాగా, నేపాల్‌ వరదల్లో ఇప్పటి వరకు 2502 మంది గల్లంతు అయ్యారనీ, అందులో నేపాల్‌ పౌరులు ఉన్నారని ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ పేర్కొంది. గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కోసం, వాటిని దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రులలో భద్రపరిచినట్టు వివరిం చింది. ప్రస్తుతం 239 మంది క్షతగాత్రులు ఆస్ప త్రులలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మరోవైపు 20వేల మంది భద్రతా సిబ్బంది భూమార్గం ద్వారా ఇప్పటివరకు మొత్తం 8,730 మందిని సురక్షిత ప్రాం తాలకు చేర్చారు. వైమానిక సిబ్బంది 363 హెలికాప్టర్‌ ట్రిప్పుల ద్వారా 236 మంది విదేశీయులతో సహా 3,081 మందిని సురక్షితంగా బయటకు తీసుకొ చ్చారు. వరదల్లో చిక్కుకున్న ఒక హైడ్రోపవర్‌ టన్నెల్‌ నుంచి 279 మందిని రక్షించారు. మరోవైపు శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు భారత్‌, చైనా స్పెషల్‌ రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా, గుర్తుపట్ట లేనంతగా ఛిద్రమైన మృత దేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు, సామూహిక అంత్య క్రియలతో నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -