
– లబోదిబో మంటున్న మామిడి రైతులు
– పత్తా లేని ఉద్యానవన శాఖ అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలో మామిడి పండ్ల తోటలు ప్రస్తుతం సుమారుగా పన్నేండు వందల ఎకారలలో సాగు చేస్తున్నారు. ప్రతి ఎటా మామిడి కాయల దిగుబడి బాగుండేది. ప్రస్తుతం ఎమి మాయ రోగం తగులుకుందో ఏమేా మామిడి రైతులకు ఆశలు వడియాసలు మిగిలినాయి, చెట్టు ఆరోగ్యంగా కన్పిస్తున్న బుడిద తెగుళ్లు వచ్చాయి, పూత వచ్చింది కానీ బుడిద తెగుళ్లకు పూత తో పాటు , చిన్న పిందే కాయలు రాలీపోయి రూపాయలు లక్షలలో మామిడి పంట నష్టం వాటిల్లుతోంది. సలహలు, సూచనలు చెప్పే వారు లేక రైతులు అందోళ చెందుతున్నారు. పండ్ల తోటలకు సంభంధించి గతంలో ప్రత్యేక శాఖ గా ఉద్యానవన శాఖ కొనసాగుతుండేది. ప్రస్తుతం ఆ శాఖ కనుమరుగై పోవడంతో నాలుగైదు మండలాలకు కాంట్రాక్ట్ బెసిక్ మీద చాలీచాలని సమయానికి జీతాలు రాని పని చేస్తు కాలం వెళ్ల దీస్తున్న హర్టికల్చర్ అధికారులు ప్రస్తుతం వారి సంప్రదించాలంటే మేాబైల్ నెంబర్లు కూడా రైతులకు అందుబాటులో లేక పోవడం గమానర్హం. వారు ఎక్కడ ఉమటారో రైతులకు తెలియని దుస్తితి నెలకొంది. రైతులు నేరుగా పెస్టిసైడ్ దుకాణాల వారికి సంప్రదించి సమస్యలు తెలియచేస్తే వారు చెప్పిన రసాయన మందులను ఇచ్చినవి వాడుతున్నారు. మామిడి పంట ను రక్షించుకునేందుకు ఎకరాకు వేల రూపాయలు మామిడి తోటలకు రైతులు ఖర్చులు చేసినప్పడికి నష్టాలే మిగిలి ఉన్నాయని మామిడి రైతులు అంటున్నారు. ఎకరం లో నాటిన మామిడి చెట్ల కాయలకు లకు గతేడాదీ లక్ష రూపాయల పైచిలుకు కోనుగోలు ళారులు చేసినారు. కేజీ మామిడి పండు 80 నుండి నూట ఇరువై రూపాయలలో రిటైల్ పండ్ల దుకాణాలలో అమ్మకాలు చేసారు. ఈ సంవత్సరం పంట సాగు పెర్గినప్పడికి పూత కాత లేక ఎకరంకు పది వేలు కూడా రావడం కోనుగోలు చేసే దళారులకు కష్టంగా ఉంది.
తగ్గిన దిగుబడి: ఈ సారీ మామిడి చెట్లకు కాతపూత ఉన్న తెగుళ్ల వలన పంటనష్టం అపారంగా ఉండటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మార్కేట్ లో మామిడపండ్ల రేట్లు విపరితంగా పెరిగే అవకాశం ఉంది. ఊరగాయలు , చట్నిలకు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిందేనని వ్యాపారస్థులు తెలిపారు.
నాగల్ గావ్ రైతు తోట సందర్శన: నాగల్ గావ్ గ్రామములో సాలే వీరేషం అనే రైతు తోటను సందర్శించిన నవతెలంగాణ రైతు మామిడి తోటలో సోకిన తెగుళ్లను రైతు చూపించారు. జర్గుతున్న నష్టం వివరాలను రైతు తెలియ చేపారు. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పరీశీలిస్తే మూడు ఎకరాలలో ఉన్న రెండువందల నలుపై రెండు చెట్లు మూడూ ఎకరాలలో సాగుచేస్తే ఇరువై చెట్లకు మాత్రమే కాస్త కొంచెం కాత, పిందే ఉంది . మిగతచెట్లకు పిందేలు రాలీపోయాయి. కొన్నింటికి పూత కూడా రాలీ పోయింది.
వాతావరణంలో మార్పు కారణం : వాతావరణంలో సంభవించిన మార్పు కారణంగా అకాల వర్షం, ఎండలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత డిసెంబర్ 23 సంవత్సరంలో అమాంతంగా పెర్గడంతో తెగుళ్లు సోకీ మామిడి పంటకు బారీగా నష్టాన్ని మిగిల్చింది.
ఎకరాకు ముప్పై నుండి యాబై వేల ఖర్చులు చేసాం: మామిడి తోట పర్యవేక్షణ ఖర్చుతో కలుపు, నీరు పారించేందుకు కూలీ తో పాటు రసాయన ఎరువులు మందుల పిచకారీ ఖర్చులు ఎకరానికి ముప్పై నుండి యాబై వేల ఖర్చు వస్తోందని లక్షల రూపాయలు పంటనష్టం జర్గుతోందని, ప్రభూత్వం మామిడి రైతులను నష్టపరిహరం లేదా ఇంకా ఏరూపంలోనైన ఆర్థిక సహయం అందించి ఆదుకోవాలని రైతు విరేశం తెలిపారు.