మేడారంలో పారిశుధ్య పనులు ముమ్మరం

– స్థానిక పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి ఈ భళే సతీష్
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం మహా జాతరకు వనదేవతలను ధరించుకునేందుకు రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల నుండి దేశ నలుమూలల నుండి ముందస్తుగానే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి, వనదేవతల దర్శనం చేసుకున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి విందు భోజనాలు ఆరగించి చెత్తను విసర్జక పదార్థాలను అక్కడే వదిలి వెళ్లారు. మేడారం దాని పరిసర గ్రామాల్లో పారిశుధ్యం వ్యాపించి ఉంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్ దగ్గర ఉండి పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మేడారంలోని ఆర్టీసీ బస్టాండు, మేడారం ఇంగ్లీష్ మీడియం చిలకలగుట్ట గద్దెల ప్రాంగణం, రెడ్డిగూడెం, జంపన వాగు చింతల క్రాస్ ప్రదేశాలలోని విసర్జక పదార్థాలను తొలగించుకుంటూ, బ్లీచింగ్ పౌడర్ ను డస్టింగ్ చేస్తున్నారు. డ్రైనేజీలలో ఉండే చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు.
Spread the love