ఎంపీడీవో కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేసినట్లు ఎంపీడీవో జీ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల పట్ల గౌరవభావంతో ఉండాలని వారి రక్షణ కొరకు పకడ్బందీగా చట్టాలను రూపొందించి అమలుపరుస్తున్నారని అన్నారు. కార్యాలయాల్లో మహిళలకు మహిళా ఉద్యోగులకు మహిళా ప్రజాప్రతినిధులకు ప్రథమ ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో క్యారం స్ లెమన్ స్పోర్ట్స్ మ్యూజికల్ చైర్ లను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చాపల ఉమాదేవి, ఏలిసాల స్వరూప, ధారావత్ పూర్ణ, ఆలూరి శ్రీనివాసరావు గోపి దాస్ ఏడుకొండలు లావుడియా రామచంద్ర మరియు కార్యాలయ సూపర్డెంట్ సాయి దుర్గ లక్ష్మి ఎంపీ ఓ సాజిదా బేగం, ఏ పీ ఓ ప్రసూన, మహిళా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love