20వేల విలువైన అధునాతన పరికరాల వితరణ

నవతెలంగాణ – గోవిందరావుపేట

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చల్వాయి కి పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు శ్రీ రాచర్ల శ్రీకాంత్, మాధవి లు గురువారం  దాదాపు 20వేల రూపాయల విలువచేసే అధునాతన ఫైవ్ జి నెట్వర్క్ వైఫై రూటర్ మరియు సెటప్ బాక్స్ పాఠశాలకు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ ఇట్టి పరికరాల వలన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయి,  ప్రాథమిక పాఠశాల చల్వాయి లో ఉన్నటువంటి ప్రొజెక్టర్ మరియు పానెల్ బోర్డులకి ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుంది అందువలన అన్ని తరగతుల విద్యార్థులకు అత్యంత అధునాతన డిజిటల్ టెక్నాలజీ తరగతుల బోధనకి మార్గం సులువు అయినది అని అన్నారు. ఇట్టి కార్యక్రమం చల్వాయి గ్రామం రిటైర్డ్ టీచర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీ కళ్యాణపు రమేష్ చేతులమీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్  మాట్లాడుతూ పిల్లలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో మీరు విరిగిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బడులకి తమ చేతనైన సహాయం అందించాలని  కోరారు.  శ్రీ రాచర్ల శ్రీకాంత్ మరియు మాధవి  ఇంతకుముందు ఈ పాఠశాలకి అధునాతన సౌకర్యమునటువంటి ప్రొజెక్టర్ అలాగే ఎల్ఈడి స్క్రీన్, సౌండ్ సిస్టం ని గత జనవరిలో సుమారు 70000 విలువగలనటువంటి వస్తువులు బహుకరించడం జరిగింది. మరియు వీరు ఇదే పాఠశాలకి అధనాతన 5జి నెట్వర్క్ సౌకర్యం కలిగిన పరికరాల్ని మరియు ఒక సంవత్సరం ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఈ పాఠశాలకు అందించడం అభినందనీయమని  అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ వాసుదేవ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పి శివ నాగేశ్వరరావు శ్రీమతి ఎం మాధవి లత ఎల్ రమేష్ బి మల్లారెడ్డి కే దిలీప్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love