– డివిజనల్ పంచాయతీ అధికారి శివకృష్ణ
నవతెలంగాణ – భీంగల్
వేసవి కాల దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటికి సమస్యలు లేకుండా చూసుకోవాలని డివిజనల్ పంచాయతీ అధికారి శివకృష్ణ పంచాయతీ అధికారులకు ఆదేశించారు. గురువారం మండలంలోని పిప్రి గ్రామపంచాయతీ కార్యాలయం, నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు రెండు పూటల నీటిని పట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం రానున్న వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో నీటి ఎద్దడి కాలనీలను గుర్తించి వాటికి కావాల్సిన పనులను చేపట్టి ప్రజలకు సమస్య లేకుండా చూడాలని పంచాయతి కార్యదర్శికి సూచించారు. ఈయన వెంట ఎంపీడీవో సంతోష్ కుమార్ ,ఎంపీ ఓ గంగ మోహన్, ఏపీవో నరసయ్య తదితరులున్నారు.