నవోదయలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. 

నవతెలంగాణ – శాయంపేట
మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. 2024 ప్రచార థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ డైరెక్టర్ మామిడి అనురాధ వివిధ రంగాలలో చేసిన సేవలను, విజయాలను గుర్తించి పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సౌమ్య, సంధ్య, జయ, మౌనిక, మాధవి, సుమలత, స్వాతి, ప్రసూన, శివ, సందీప్, రాజేందర్, వెంకట్ పాల్గొన్నారు.

Spread the love