ఘనంగా శివపార్వతుల కళ్యాణం

– పంభాపూర్ లో శివరాత్రి వేడుకలు

– అలంకారమైన శివాలయం
– మార్మోగిన ఓంకారనాదం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పంభాపూర్ గ్రామంలో లో  శివరాత్రి సందర్భంగా శివాలయం ముస్తాబైంది. శుక్రవారం నాడు మహాశివరాత్రి కి  శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తో పాటు, మిగతా అక్కడ ఉన్న వివిధ ఆలయాలు కూడా అలంకరణతో కళకళలాడాయి. శివ భక్తుల కోలాహలం, ఓంకార నాదం ఓం నమశ్శివాయ అంటూ పంభాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మార్మోగింది. శుక్రవారం రోజున ఉదయం 8 గంటల నుండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో లో అధిక సంఖ్యలో శివ భక్తులు గ్రామస్తులు వీధి వీధుల వెంట ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు గుట్ట దేవరను భజన కీర్తన లతో, ప్రత్యేక పూజలతో తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు గంగా స్థానాలు ఆచరించి, రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం, ఒంటి గంట కు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గుడి నిర్వాహకురాలు ప్రధాన పూజారి నాలి పుల్లక్క, పంభాపూర్ శివ భక్తుల సంఘం అధ్యక్షులు నాలి రవి, శివ భక్తులు, గ్రామ ప్రముఖులు గ్రామ పెద్దలు ఘనంగా శివ పార్వతి కళ్యాణం స్థానిక మాజీ సర్పంచ్ లు ఎల్లబోయిన జానకిరాంబాబు, పోలేబోయిన కృష్ణ, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ నాలి కన్నయ్య, జి సి సి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, అర్రెం కృష్ణ, కల్తి నారాయణ, మంకిడి నర్సింహ స్వామి, వెంకటేష్, గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాటాపూర్, పంబాపూర్, దామర్వాయి, నర్సాపూర్, గంగారం, బంజారా, అంకంపల్లి, కౌశెట్టివాయి, బీరెల్లి, రంగాపూర్, సరిహద్దు మండలమైన మంగపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నైనా ఆనందంగా శివపార్వతులకళ్యాణం ని వీక్షించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ విగ్రహం, నాగదేవత, విగ్రహాలతో పాటు బద్ది పోచమ్మ ఆలయం కూడా భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పెద్దలు, గామ ప్రముఖులు, వివిధ యూత్ సంఘాల నాయకులు, గ్రామస్థులు మహాశివరాత్రి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. వీరికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సర్పంచ్, గ్రామస్తులు మౌలిక సదుపాయాలను కల్పించారు. పంబాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా శానిటేషన్ పనులు నిర్వహించారు.
బహుమతులు ప్రధానం: మహాశివరాత్రి సందర్భంగా పంభాపూర్ గ్రామంలో యువకులకు విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించారు. గత మూడు రోజుల నుండి  క్రీడలను నిర్వహిస్తున్నారు. చివరి రోజైన శుక్రవారం పంబాపురం లోని శివాలయం ఆవరణలో విజేతలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క కుమారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ధనుసరి సూర్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులుసం రమేష్, యూత్ నాయకులు పోలేబోయిన కుమార్, యూత్ నాయకులు గ్రామ ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సహాయం అందించాలి..ఆలయ నిర్వాహకురాలు నాలి పుల్లక్క: సుమారు పదేళ్లుగా మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు ప్రధాన పూజారి నాలి పులక్క, నాలి రవి లు అన్నారు. ప్రభుత్వం నుండి  ఆర్థిక సహాయం అందించాలని  వారు కోరారు. మహా శివరాత్రి కార్యక్రమాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అధికారులు స్పందించి పంబాపూర్ శివాలయానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Spread the love