నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 250 గజాల ప్లాటును కేటాయిస్తామని ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం కృతజ్ఞతలు తెలిపారు. 250 గజాల చొప్పున ప్లాట్లను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 113,114 సర్వే నెంబర్లు లో కేటాయించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో రేపు జరగబోయే పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారు లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ తూర్పింటి రవి,మునుగోడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దగొని రమేష్ గౌడ్ కట్టెల లింగస్వామి,సంగిశెట్టి జనార్ధన్ ప్రభుత్వాన్ని కోరారు.