నవతెలంగాణ – తాడ్వాయి
ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె రైతు వేదిక భవన్ లో అడిషనల్ కలెక్టర్ శ్రీజ స్థానిక తహసీల్దార్ తోట రవీందర్ లతో కలిసి షాది ముబారక్ 5, కళ్యాణ లక్ష్మి 45 మొత్తం 50 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మాయిల పెండ్లిల్లు చేసి అమ్మాయిల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.