నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామనికి చెందిన లంజపెల్లి అనిల్ – స్వాతి వివాహానికి శనివారం ములుగు జిల్లా జడ్పీ ఛైర్మన్ బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావ్, మాజీ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ, యూత్ మండల అధ్యక్షులు కోట సురేష్, యూత్ నాయకులు తడక హరీష్, బిఆర్ఎస్ నాయకులు సాయిరి లక్ష్మి నర్సయ్య, గడ్డం సత్యం, రజాక్, తదితరులు పాల్గొన్నారు.