ప్రాధమిక వ్యవసాయ సహాకారం పతి సంఘాలను సందర్శించిన విద్యార్ధులు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం,గంగారం లోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మంగళవారం కళాశాల అసోసియేట్ డీన్ పర్యవేక్షణలో  సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శన లో భాగంగా స్థానిక ప్రాధమిక వ్యవసా సహకార పరపతి సంఘం పనితీరును అర్ధం చేసుకున్నారు.గ్రామీణ వ్యవసాయం లో ఈ స్థానిక ఆర్ధిక సంఘాల ఆవశ్యకత, పని తీరు,సంస్థా గత నిర్మాణం, నియమాలు, సభ్యత్వం తో ఉన్న ప్రయోజనాలు, టర్న్ ఓవర్, రుణాలు, వడ్డీ రేట్లు మొదలగు విషయాలను పీఏసీఎస్ కార్యదర్శి వీరా స్వామి విద్యార్థులకు వివరించారు. వ్యవసాయ అర్ధ శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ కృష్ణ తేజ ఈ క్షేత్ర సందర్శనను సమన్వయ పరిచారు.
Spread the love