బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇరువురు అరెస్ట్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ నెల 20 వ తేదీ రాత్రి సుమారు 9 గంటలు సమయంలో అశ్వారావుపేట బస్టాండ్ లో ఇద్దరు అమ్మాయిలు వారి ఇంటికి వెళ్లడానికి వేచి చూస్తుండగా తమ ఇంటి వద్ద దింపు తాను  ఇద్దరు గుర్తుతెలియని ఆటో డ్రైవర్లు తన ఆటోను ఎక్కించుకుని అశ్వారావుపేట శివారు గల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ముందు ఉన్న పాకలు వద్దకు తీసుకుని వెళ్లి వాళ్లతో తప్పుగా ప్రవర్తించారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుండి తప్పించుకుని కేకలు వేస్తూ రోడ్డు పైకి రాగా ఇట్టి విషయంపై అశ్వారావుపేట పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బుదవారం స్థానిక పోలీస్ లు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని ఆటో డ్రైవర్లు పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు కంగాల జయరాజ్, గుమ్మల్ల రామ్ చరణ్ అని చెప్పి అట్టి నేరానికి ఉపయోగించిన ఆటో ఇదే అని చూపించగా పోలీసు వారు ఆ ఆటోని స్వాధీన పరచుకుని అట్టి నేరాన్ని ఒప్పుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్ లను రిమాండ్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ శ్రీకాంత్ తెలిపారు.
Spread the love