మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెన్న రాజు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వెన్న రాజును శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జాతి ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేసిన వెన్న రాజు ను జిల్లా అధ్యక్షుడు నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడి  నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ మరింత బాధ్యతలను అప్పగించడం పట్ల దళిత గిరిజన బహుజనుల అభివృద్ధి కోసం మరింత పాటుపడతానని వెన్న రాజు అన్నారు.

వెన్న రాజు ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్న రాజు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించడం పట్ల  కాంగ్రెస్ నాయకులు హర్షిస్తూ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చ అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, పోలు సంపత్ ,బిఖ్యానాయక్ ,బందారపు శ్రీనివాస్, గుగులోతు రాజు నాయక్ ,పోతారం శ్రీనివాస్ లింగాల యాదగిరి రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love