ఇందూరు తిరుమలలో ఘనంగా ధ్వజారోహణం

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలం నర్సంపల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం అగ్ని ప్రతిష్ట,  ద్వజారోహణం, దేవత ఆహ్వానం వంటి సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ వేడుకల్లో పాల్గొన్న శ్రీ శ్రీ శ్రీ దేవనాథ జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి ఆలయాల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు.  అలాగే ఆదివారం సాయంత్రం గరుత్మంతుని అనుగ్రహం కోరకు  యజ్ఞం నిర్వహించారు. గరుడధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించడం జరిగుతుందని దేవనాథ జీయర్ స్వామి అన్నారు గరుద్మంతుడి శక్తి ముందు దుందుడుపే… అంత వేగం మరియు అంత శక్తి గరుడుకి రావడానికి కారణం అతనికి అతని తల్లి వినత పైన గల్గిన భక్తియే అని దేవనాథ జీయర్ స్వామి మరియు ఆచార్య గంగోత్రి రామానుజ స్వామి వారు ప్రవచనం చేశారు. ఉదయం అగ్నిదేవుని ఆహ్వానించి యాగ కార్యక్రమం మొదలు పెట్టారు. ధ్వజారోహణ చేసి గరుడ ప్రసాదం దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ స్వాముల వారి చేతుల మీదుగా సంతానం లేని దంపతులకు పంచడం జరిగింది. మధ్యాహ్నం తదియారాధనతో కార్యక్రమాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో దేవనాథ జీయరు స్వామి వారు ఆచార్య గంగోత్రి రామానుజ స్వామివారు, ఆలయ ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత శిరీష్, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, రవియాదవ్ నర్సారెడ్డి నరాల సుధాకర్ ప్రసాద్ రాజేశ్వర్ రమేష్ సాయిలు భాస్కర్ మూర్తి మురళి చిన్నయ్య ప్రమోద్ గంగారెడ్డి లక్ష్మి నరేష్ సురేష్ పాల్గొన్నారు. యజ్ఞాచార్యులు ఆచార్య శిఖామణి స్వామి , శ్రీఖర్ ఆచార్య, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love